13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

నీవు సోలితే , నీతో ఆగదు - నీ నీడ.
ఊపిరాగితే నీతో రాదు - ఏది కూడా ..... అందుకే
అనుభవించవోయ్ జీవితాన్ని. దేవుడిచ్చిన చిన్న వరాన్ని.

ఒంటరితనంలో బాధపడతావు
- నిన్ను నువ్వు ప్రేమించటం నేర్చుకునే వరకూ.
ఓటమిని చూసి భయపడతావు
- ప్రయత్నం గురించి తెలియనంతవరకూ.
గెలుపంటే కూడా భయమే
- అదిచ్చే ఆహ్లాదం వూహించలేనంత వరకూ
ప్రజలంటే కూడా జంకే
- కాకులకంటే గొప్పగా వుంటారనుకున్నంత వరకూ.
నిన్ను ఎవరైనా తిరస్కరిస్తారనుకుంటే
- అది నీ మీద నీకు నమ్మకం లేక .
గాయాలంటే నీకు అమితమైన బాధనుకుంటే
- అవి లేనప్పటి సుఖం నీకు తెలియక.
సత్యాన్ని చూసి నువ్వు వణికావంటే
- అబద్దమెంత నికృష్టమో అర్ధంకాక.
ప్రేమించటానికి సంశయిస్తున్నావంటే
- హృదయపు లోతుల్లోంచి అది స్వచ్చంగా రాక.
జీవితాన్ని అలసటతో శ్వాసిస్తావు
- అందాన్ని ఆస్వాదించటం చేతకాక.
ఎగతాళికి ఎక్కడికో పారిపోతావు
- నీలో నువ్వు నవ్వుకోవటం రాక.
రేపటి భవిష్యత్తుకి బెదురుతావు
- జ్ఞానం పైరుకి అది ఎరువని గుర్తించక.
నిన్నటి గతాన్ని తలచి చెదురుతావు
- బలమిచ్చే ఎరువు, ఒకప్పటి నికృష్టమన్న
జ్ఞానం లేక.
చీకటిని చూసి కళ్లు మూయకోయ్
- నక్షత్రాలు కనబడే వేళ అది.
వెలుగుని చూసి వెనుదిరగాకోయ్
- సత్యం స్నేహహస్తం సాచే సమయమది.
గమ్యంవైపు అడుగు వేస్తూ
- దూరాన్ని చూసి భయపడితే ఎలా ?
గొంగళి పురుగై పుడితేనేం
- దాని గమ్యం సీతాకోకచిలుకే కదా !

28, డిసెంబర్ 2008, ఆదివారం

"If you want something you never had,
do something you have never done..

Don't go the way life takes you.
Take the life the way you go.

And remember you are born to live and
not living because you are born."